రేపు అమ్మ ఆరోగ్యం కేసు, ఎల్లుండి అక్రమాస్తుల కేసు

Update: 2016-10-05 15:46 GMT

బహుశా ఇలాంటి విలక్షణమైన పరిస్థితి నాయకులకు కూడా అంత సులువుగా ఎదురయ్యేది కాదు. ఎంతో అరుదైన సందర్భం అనే చెప్పాలి. పురట్చితలైవి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుం తీవ్రమైన ఆరోగ్య సమస్యతో అపోలోలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం గురించి రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల్లో తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్నాయి.

ఇలాంటి కీలకమైన సమయంలో జయలలిత ఆరోగ్యం గురించి ఓ ప్రెవేటు పిటిషన్‌ హైకోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే. ఆ విషయంలో జయలలిత ఆరోగ్యం గురించి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిందేనంటూ.. అపోలో ఆస్పత్రిని హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి.. అపోలో ఆస్పత్రి వర్గాలు జయలలిత ఆరోగ్యం గురించి సవివరమైన నివేదికను ఇవాళ బుధవారం హైకోర్టుకు అందించాయి. దీంతో గురువారం నాడు అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించిన పిటిషన్‌పై విచారణ జరగబోతోంది.

అయితే మరో యాదృచ్ఛికమైన అంశం ఏంటంటే.. శుక్రవారం నాడు జయలలితకే సంబంధించి మరొక కేసు కూడా హైకోర్టులో విచారణకు రానుంది. అది జయలలిత అక్రమాస్తుల కేసు. జయలలిత అక్రమాస్తులకు సంబంధించిన కేసులు సుదీర్ఘకాలంగా నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లోనే ఆమె జైలుశిక్షలు కూడా అనుభవించారు. ఆ కేసుల్లో మళ్లీ శుక్రవారం విచారణ సాగనుంది.

జయలలిత కు సంబంధించి ఒకరోజు ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రతపై పిటిషన్‌, మరు రోజున ఆమె అక్రమాస్తుల గురించి పిటిషన్‌ విచారణకు రానుండడం తమాషా విషయమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News