యాంకర్ ప్రదీప్ కు మూడు సీన్లు చూపించిన పోలీసులు

Update: 2018-01-08 10:52 GMT

యాంకర్ ప్రదీప్ ట్రాఫిక్ పోలీసుల కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. డిసెంబరు 31వ తేదీ రాత్రి తప్పతాగి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిపోయిన సంగతి తెలిసిందే. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయి. దీంతో ప్రదీప్ పై కేసు నమోదయింది. అయితే ఇప్పటి వరకూ ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాలేదు. తాను షూటింగ్ లలో బిజీగా ఉన్నందున హాజరుకాలేకపోయాయనని చెప్పారు. ప్రదీప్ కు మద్యం తాగి వాహనాలు నడిపితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వివరించే మూడు డాక్యుమెంటరీ చిత్రాలను ట్రాఫిక్ పోలీసులు చూపించారు. ప్రదీప్ తో పాటు అతని తండ్రి కూడా హాజరయ్యారు. కౌన్సెలింగ్ తర్వాత ప్రదీప్ ఇంటికి వెళ్లిపోయారు.

Similar News