మోడీతో బాబు భేటీ ఇంకా ఖరారు కాలేదా?

Update: 2018-01-09 08:38 GMT

ప్రధానినరేంద్ర మోడీ తో ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారని వార్తలొచ్చాయి. అయితే ముందుగా అనుకున్నట్లు 12వ తేదీన భేటీ ఇంకా ఖరారు కాలేదు. ప్రధాని మంత్రి కార్యాలయం అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం అధికారులతో భేటీ తేదీలతో సంప్రదిస్తున్నారు. 12, 13, 17వ తేదీల్లో మోడీ భేటీకి సమయం ఇచ్చే అవకాశం ఉంది. అయితే 12, 13 తేదీలు సంక్రాంతి పండుగ దినాలు కావడంతో 17వ తేదీన అపాయింట్ మెంట్ ఖారారు చేయాలని చంద్రబాబు కార్యాలయ అధికారులు పీఎంవోను కోరినట్లు తెలిసింది. అయితేఇంకా అధికారికంగా మోడీ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు.

Similar News