మద్యం మత్తుకు మరో యువతి బలయిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో యూపీకి చెందిన విద్యార్థిని అనన్య మృతి చెందింది. నిన్న రాత్రి నితిన్ బర్త్ డే వేడుకలు కావడంతో నైట్ పార్టీ జరిగింది. ఈ కారులో అనన్య, నిఖిత, నితిన్ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చేసరికి మితిమీరిన వేగంతో ఉన్న కారును అదుపు చేయలేక డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అనన్య అక్కడిక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.