మంత్రిగా తన చివరి లేఖ అదే

Update: 2018-03-08 05:12 GMT

దేవాదాయ శాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి జోక్యం చేసుకోలేదని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తాను ఏరోజూ కంప్యూటర్ ను వాడలేదని, స్మార్ట్ ఫోన్న వాడలేదని, చంద్రబాబు స్ఫూర్తితోనే తాను అన్నీ నేర్చుకోగలిగానన్నారు. తాను మంత్రిగా ఉండి గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులను మాణిక్యాలరావు అసెంబ్లీలో వివరించారు. తాడేపల్లి గూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానన్నారు. తన నియోజవకర్గంలో ఒక బాలుడు మరణిస్తే చంద్రన్న బీమా వర్తింప చేయాలని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే స్పందిచారన్నారు. మంత్రిగా తన చివరి లేఖ అదే చివరిదన్నారు. బీజేపీకి వైద్యాలయం, దేవాలయం శాఖలను తమకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఒక్కరే ఏపీకి అండగా నిలబడ్డారన్నారు.

Similar News