కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డి డాక్టరేట్ పై మరోసారి విమర్శలకు దిగారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడారు. 2004 ఎన్నికల అఫడవిట్ లో 1987లో పాసయినట్లు లక్ష్మారెడ్డి చూపారు. బీహెబ్ఎంఎస్ చదువు ఐదేళ్లలో పూర్తవుతుంది. 1990లో అనుమతి వచ్చిన గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1987లోనే పాసయినట్లు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. కళశాల ప్రిన్సిపల్ హన్మంతరావు ఆయన 1988లో ఎలా సర్టిఫికేట్ పొందుతారన్నారు. లక్ష్మారెడ్డి విద్యార్హతలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా తనకు వివరాలు అందించండం లేదన్నారు. చదువుమీద, ప్రాక్టీస్ మీద మా అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత లక్ష్మారెడ్డిపై ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడానికి అనర్హుడవని ఆయనపై రేవంత్ నిప్పులు చెరిగారు. తనపై చట్టపరంగా ఏం చర్య తీసుకున్నా సిద్ధమేనని రేవంత్ సవాల్ విసిరారు.