హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెట్లు ధరలు ఖరారయ్యాయి. రెండు కిలోమీటర్ల వరకూ పది రూపాయలు. కనీస టిక్కెట్ ధర పది రూపాయలకు కాగా గరిష్ట ధర 60 రూపాయలుగా నిర్ణయించింది. రెండు కిలోమీటర్ల వరకూ పది రూపాయలు, రెండు నుంచి నాలుగు కిలోమీటర్లకు పదిహేను రూపాయలు, నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకూ 25 రూపాయలు, ఆరు నుంచి 8 కిలోమీటర్లకు 35 రూపాయలు, పది నుంచి పధ్నాలుగు కిలోమీటర్లకు 40 రూపాయలు, పధ్నాలుగు నుంచి 18 కిలోమీటర్ల వరకూ 45 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 22 కి.మీ 50 రూపాయలు, 22 నుంచి 26 కిలోమీటర్ల వరకూ 60రూపాయలు, 26 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తే 60 రూపాయలు వసూలు చేస్తారు. రేపటి నుంచే స్మార్ట్ కార్డులు అమ్మనున్నారు. ప్రధాని మోడీ ఈ నెల 28వ తేదీన మెట్రో రైలును ప్రారంభించనున్న సందర్భంగా మెట్రో రైలు టిక్కెట్ ధరలను ఎల్ అండ్ టి సంస్థ ఖరారు చేసింది.