Gold Price Today : పసిడిప్రియులకు గుడ్ న్యూస్.. ధరలు మరింత తగ్గాయ్ గా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెద్దగా పెరగడం లేదు. పైగా తగ్గుతున్నాయి. అంటే ఒకరకంగా బంగారం, వెండి ధరలు యుద్ధం ప్రభావంతో అనిశ్చితిలో కొనసాగుతున్నాయి. యుద్ధం ఎంత కాలం జరిగితే అంత భారీగా పతనమవుతాయన్న అంచనాలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. మిగిలిన వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, బంగారం, వెండి ధరలు మాత్రం పెద్దగా పెరగకపోవడంతో పాటు తగ్గుతుండటం పసిడిప్రియులకు ఊరట కలిగించే అంశమే.
పెట్టుబడులు తగ్గి...
అమెరికా డాలర్ బలహీనం కావడంతో పాటు, పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధించిన సుంకాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు. ఇంకా ధరలు తగ్గుతాయని చాలా మంది వేచి చూస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో తమకు అవసరమైన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తుండటంతో ఒకింత అమ్మకాలు బాగానే సాగుతున్నాయి.
ధరలు ఇలా...
మరొకవైపు మదుపుదారులు భయపడిపోతున్నారు. బంగారం, వెండిపై పెట్టుబడి సురక్షితం కాదని భావించి పెద్దగా పెట్టుబడి పెట్టడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,090 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,650 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,60,100 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.