ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి చెందారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా హరిభూషణ్ పనిచేస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కు కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. హరిభూషణ్ చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు ఇంకా జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ భారీ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గత 48 గంటల నుంచీ ఈ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ అపరేషన్ నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజూమున జరిగిన ఎదురు కాల్పుల్లో మావొయిస్టులకు ఉహించని రీతిలో పోలీసులు దెబ్బతీశారు. ఈ ఎన్ కౌంటర్ వట్టి బూటకమని. అడవిలో వున్న అన్నలను పట్టుకుని తీసుకొచ్చి కాల్చి చంపారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఎన్ కౌంటర్ పై సమగ్రంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అగ్రనేత ఆజాద్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది.