ప్రేమించలేదని చంపేశాడు...చచ్చిపోయాడు...!

Update: 2017-12-30 13:18 GMT

భద్రాద్రి అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట గ్రామానికి చెందిన ఊటుకురి ప్రవల్లిక దమ్మపేట మండలం నేమిలిపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పని చేస్తోంది, గత రెండు సంవత్సరాలు నుంచి తన మేనమామ పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరవుతో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ప్రవల్లిక తల్లితండ్రులు వచ్చే నెల పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు, ఆ పెళ్లికి ప్రవల్లిక ఒప్పుకోవటంతో ప్రియుడు తట్టుకోలేక ప్రవల్లిక గొంతుకోసి చంపేశాడు. అక్కడికక్కడే పురుగులు మందు తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు, అయితే స్కూల్ కు వచ్చే సమయానికి ప్రియుడు పురుగులు మందు తాగి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. దమ్మపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తున్నారు

Similar News