పోలీసుల ఆధీనంలో గొల్కొండ కోట...!

Update: 2017-11-25 04:28 GMT

పోలీస్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇవాంకా అండ్ పీఎం టూర్ లో భాగంగా ఈ తనిఖీలు చేస్తూనే ఉన్నారు పోలీసులు. రెండు వేల మంది గెస్ట్ లకు గోల్కొండ ఫోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వం విందు ఏరాటు చేసేంది. దేంతో ఈ ఏరియా మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుంటున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యం లో, ఈరోజు దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది తో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నెల 28 తేదీన హైదరాబాద్ లో జరుగుతున్న "గ్లోబల్ సమ్మిట్" అనే కార్యక్రమంలో, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె "ఇవాంకా ట్రంప్" మరియు విదేశీ డేలిగేట్లు, హైదరాబాద్ కు వస్తున్నారని, భద్రత సందర్భంగా ఈరోజు గోల్కొండ లో ఈ కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో దాదాపు 600 ఇళ్లను పోలీసులు తనిఖీలు చేసారు. ఇందులో ఆటోలు, కార్లు మరియు బైకులు కలిసి మొత్తం 57 డాకుమెంట్స్ లేని వాహనాలు, 33 మంది అనుమానితులు మరియు ఇద్దరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోని చెకింగ్ చేసి వీరందరి వేలి ముద్రలు సేకరించారు. వీరందరి పైన గతంలో ఎలాంటి కేసులు ఉన్నా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

Similar News