విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పై విరుచుకుపడ్డారు. కులభూషణ్ జాదవ్ ను అతని భార్య, తల్లి, బిడ్డను కలవడంలో పాకిస్థాన్ చేసిన చేష్టలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. కులభూషణ్ జాదవ్ పాక్ జైలులో మగ్గుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జాదవ్ తల్లి, భార్య ఆయనను కలిసేందుకు వెళ్లగా పాక్ అధికారుల చర్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై లోక్ సభలో మంత్రి సుష్మాస్వరాజ్ ఒక ప్రకనట చేశారు.
పదే...పదే అవమానం.....
జాదవ్ తో మాట్లాడేందుకు వెళ్లిన తల్లి, భార్య గాజులు, మంగళసూత్రాలు, బొట్టు తీసి వేయించి పాక్ అధికారులు అవమానర్చారని సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం జాదవ్ భార్య ఎన్నిసార్లు బూట్లు అడిగినా ఇవ్వ లేదని, ఆ షులో కెమెరా ఉందని పాక్ ప్రకటనచేయడం విడ్డూరంగా ఉందని సుష్మా అన్నారు. పాక్ అధికారులు జాదవ్ కుటుంబాన్ని పదేపదే అవమానించారని సుష్మా అన్నారు. జాదవ్ తల్లి మరాఠీలో మాట్లాడబోగా పాక్ అధికారులు ఇంటర్ కామ్ ను ఆపేశారన్నారు. జాదవ్ ను సురక్షితంగా భారత్ కు తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సుష్మా చెప్పారు.