పవన్ పై రేవంత్ సెటైర్లు

Update: 2018-01-02 07:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పడిపోయారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. తెలంగాణ ఇస్తే అంధకారంలోకి వెళుతుందన్న నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలు వాస్తవమేనన్నారు. కాంగ్రెస్ వల్లనే ఈరోజు తెలంగాణలో మిగులు విద్యుత్తు ఉందన్నారు. విద్యుత్ పంపిణీ రాష్ట్ర విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన జరగకపోవడం వల్లనే తెలంగాణ లాభపడిందన్నారు. పవన్ కల్యాణ్ లోతుపాతులను తెలుసుకోకుండా 24 గంటలూ ఉచిత విద్యుత్తు ఇవ్వడంపై కేసీఆర్ ను పొగిడారన్నారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ విద్యుత్తు కొనుగోలు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ ను వాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. విద్యుత్తు జేఏసీ నేత రఘు విద్యుత్తు ఒప్పందాలపై రాసిన పుస్తకాన్ని తాను పవన్ కు పంపిస్తానని, దానిని చదివి అవగాహన పెంచుకోవాలన్నారు.

Similar News