నిన్న మంగళవారం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా ప్రకటించిన నంది అవార్డుల ప్రకటనపై సర్వత్రా విమర్శలు పెల్లు బీకుతున్నాయి. ఈ నంది అవార్డులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కుల వర్గానికే కాపు కాసి మిగతా కులాల వారికీ అన్యాయం చేశారనే టాక్ సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు నంది అవార్డు రావడం అనేది వారి వారి టాలెంటులను బట్టి ఉంటుంది. కానీ ఒకప్పుడు అలాగే ఉండేది ఈ నంది అవార్డులు ఎంపిక. కానీ కాలక్రమేణా నంది అవార్డు నవ్వులపాలవుతుందనే మాట మాత్రం బాగా వినబడుతుంది. ఇప్పుడు ఇంతకీ నంది అవార్డులతో చాలామందికి న్యాయం జరిగినా.. ఇంకొంతమందికి అన్యాయం జరిగిందనే విషయం మాత్రం తేటతెల్లమైంది.
ప్రభాస్ కు ఇవ్వకుండా....
ఇక్కడ లెజెండ్ కి 2014 కు గాను అనేక అవార్డులు వరించింది. అందులో వింతేమీ లేదు. కానీ 2015 కి వచ్చేసరికి శ్రీమంతుడు కి బాహుబలి గట్టి పోటీ ఏర్పడింది. బాహుబలి అన్ని కేటగిరీలలో నందులను ఎగరేసుకుపోగా... ఒక్క ఉత్తమ నటుడు అవార్డుని మాత్రం వదులుకోవాల్సి వచ్చింది. ఆ ఉత్తమనటుడు అవార్డుని మహేష్ శ్రీమంతుడికి ఇచ్చారు. మరి ప్రభాస్ బాహుబలిగా ఎలాంటి పెరఫార్మెన్సు చూయించాడో అనే విషయం యావత్ భారతానికి తెలుసు. మహేష్ కూడా శ్రీమంతుడులో అద్భుతమైన నటన కనబరిచ్చాడు. కానీ ప్రభాస్ కి బెస్ట్ హీరో అవార్డు రాకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి కనబడుతుంది.
బాలయ్య బాబు హ్యాండ్...?
ఇక 2016 లో ఉత్తమ చిత్రంగా పెళ్ళి చూపులుకిచ్చి... ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ కి అవార్డు ప్రకటించారు. మరి 2014 , 2016 అవార్డుల విషయంలో కాస్త నెమ్మదిగా వున్న అభిమాన గణం 2015 విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. నంది అవార్డుల ఎంపికలో కుల రాజకీయాలు చేశారనే మాట మాత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ నంది అవార్డుల వెనుక బాలకృష్ణ హ్యాండ్ గట్టిగా ఉందంటున్నారు కూడా. ఏది ఏమైనా నందుల ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని గొంతులో పచ్చివెలక్కాయ పడేలా చేసింది.