తెలంగాణాను వదలి పెట్టని కరోనా .. ఒక్కరోజులోనే

తెలంగాణాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు 1,831 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

Update: 2020-07-07 03:15 GMT

తెలంగాణాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు 1,831 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కు చేరుకుంది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 306కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 1,419 కేసులు నమోదయ్యాయి. జిల్లాలకు కూడా కరోనా వైరస్ పాకుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News