తెరపిన పడుతున్న హైదరాబాద్‌ నగరం

Update: 2016-09-26 00:15 GMT

భారీవర్షాలకు జనజీవనం అతలాకుతలం అయిన హైదరాబాదు నగరంలో పరిస్థితులు మళ్లీ క్రమంగా గాటన పడుతున్నాయి. ఆదివారం కాస్త వాతావరణం ప్రశాంతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా కాసిని చినుకులు పడినప్పటికీ, పనులు ఆగిపోయేంత పెద్ద వర్షం రాలేదు. దీంతో పలు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీరు తొలగించడం కూడా సాధ్యమైంది. ప్రజలు తిరిగి సాధారణ పరిస్థితి వైపు మళ్లుతున్నారు.

నాయకులు కూడా ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. పైగా ఆదివారం సెలవు దినం కావడం, పాఠశాలలకు శుక్ర, శని వారాలు కూడా సెలవులే కావడంతో.. మూడురోజులుగా ఇళ్లలోనే ఉన్న ప్రజలు ఆదివారం చిన్న చిన్న పనుల నిమిత్తం బయటకు వచ్చారు. వర్షంలో చిక్కుకుపోయిన జీవితాన్ని గాడిలో పెట్టుకునే పనుల్లో పడ్డారు.

అయితే వాతావరణ నిపుణులు అంచనాల ప్రకారం మరో నాలుగు రోజులు భారీ వర్షాలు, తర్వాత ఓ మోస్తరు వర్షాలు ఉన్నాయని అంటున్నారు. సోమవారం కూడా వాతావరణం తెరపిగానే ఉంటే కాస్త పనులు నడుస్తాయని, మునుపటి లాగే సోమవారం భారీ వర్షాలు మొదలైపోతే జనానికి చాలా ఇబ్బంది అవుతుందని పలువురు అనుకుంటున్నారు.

Similar News