హీరోయిన్లు ఫొటోలు మార్ఫింగ్. ఆశ్లీల వెబ్ సైట్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా రంగానికి మార్ఫింగ్ మాఫియా ముప్పు ఉంది. సినిమా వాళ్లకి సంబంధించిన గాసిప్స్ తో పాటు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల బెడద ఉంది. అశ్లీల వెబ్ సైట్లలో సినిమా వాళ్ల పరువు తీసేలా కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారు. దీన్ని కట్టడి చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఇటువంటి వెబ్ సైట్స్ ను నియంత్రించలేక పోతున్నారు. అయితే మా అసోసియేషన్ మాత్రం ఈ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని సంవత్సరకాలంగా కోరుతూ వస్తుంది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ కొన్ని సైట్స్ ను డిలిట్ చేసింది. సీఐడీ దాడులకు భయపడి సినీ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న ముఠా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది. అయితే ఒక వెబ్ సైట్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బోడుప్పల్ కు చెందిన సివిల్ ఇంజనీర్ రఘవరన్ ను సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. తన వెబ్ సైట్స్, బ్లాగ్ రేటింగ్ పెంచుకోవడానికి హీరోయిన్ల ఫొటోలను ఇతగాడు మార్ఫింగ్ చేస్తున్నాడని విచారణలో తేలింది. అసభ్యకరమైన వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నాడు.
డబ్బులు వస్తుండటంతో.....
తన వెబ్ సైట్స్ కు మంచి రేటింగ్ తో పాటు డబ్బులు కూడా వస్తున్నాయి. దీంతో సినిమా వాళ్లు మీద ఇబ్బడి ముబ్బడి గా పోస్టింగ్ పెట్టడడం మొదలు పెట్టాడు. అభ్యంతరకరమైన పొస్టింగ్ లపై విచారణ చేస్తున్న సైబర్ క్యాప్ పోలీసులు చివరకు రఘవరన్ అరెస్టు చేశారు.ఇతను గత కొంత కాలంగా సైబర్ టెక్నాలజీతో తన ఐపి అడ్రస్ దొరక్కకుండా తన బ్లాగ్. తో పాటుగా వెబ్ సైట్స్ లో సినిమా వాళ్ల మీద అసభ్యకరమైన పొస్టింగ్ లు పెడుతున్నాడని అధికారులు చెప్పారు. ఇలాంటి వెబ్ సైట్స్ నడుపుతున్న వారు చాలా మంది వున్నారని .. వారందరి పైనా ఇప్పటికే నిఘా పెట్టామని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని సీఐడి ప్రకటించింది.