తాడిపత్రిలో మరో వివాదం చోటు చేసుకుంది. జేసీ బ్రదర్స్ తమపై దౌర్జన్యం చేశారంటూ టీడీపీ నేతలే ధర్నాకు దిగడం విశేషం. టీడీపీ కార్యకర్త శేఖర్ కు చెందిన ట్రాన్స్ పోర్టు కంపెనీపై జేసీ వర్గీయులు దాడి చేశారని నేతలు జయచంద్రారెడ్డి, కాకర్ల రంగనాధ్ ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ పోర్టు కంపెనీకి చెందిన కారు, లారీ అద్దాలను, ఫర్నీచర్ ను జేసీ అనుచరులు ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పసుపు జెండా పట్టుకుని మరీ తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడం గమనార్హం. జేసీ బ్రదర్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.