తమిళనాడు సీఎస్ నివాసంలో ఐటీ దాడులు

Update: 2016-12-21 06:59 GMT

తమిళనాడు ఛీఫ్ సెక్రటరీ రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బుదవారం తెల్లవారుజామునుంచే ఐటీ దాడులు ప్రారంభించారు. ఈ దాడులతో బ్యూరోక్రాట్లు, రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించింది. రామ్మోహనరావు జయలలితకు అత్యంత సన్నిహితుడు. జయ కోటరీలో ఒక సభ్యుడు.

శేఖర్ రెడ్డికి సన్నిహితుడు...

రామ్మోహనరావు ఇంట్లో పెద్ద యెత్తున నగదు, బంగారం ఉన్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో దాడులు ప్రారంభించారు. రామ్మోహనరావు ఇటీవల ఐటీ దాడుల్లో పట్టుబడ్డ శేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. శేఖర్ రెడ్డి తమిళనాడులో ఇసుక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇందుకు విజిలెన్న్ అధికారిగా ఉన్న రామ్మోహనరావు కూడా సహకరించినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేఖర్ రెడ్డి పట్టుబడిన తర్వాతే రామ్మోహనరావు విషయం ఐటీ అధికారులకు తెలిసిపోయింది. దీంతో చెన్సై లోని అన్నానగర్ లోని రామ్మోహనరావు నివాసంపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు ఈ దాడులను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్మోహనరావు కుమారుడు పన్ను ఎగవేత కేసులో సోదాలు జరుపుతున్నామని ఐటీ అధికారులు చెబుతున్నారు.

Similar News