ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం

Update: 2017-12-28 14:14 GMT

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై కొద్దిసేపటిక్రితం ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీంతో ట్రిపుల్ తలాక్ చెబితేనేరం అవుతుంది. ముడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ బిల్లును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి దీనిపై చర్చ జరిగింది. ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దీన్ని వ్యతిరేకించారు. కొన్ని సవరణలు చేశారు ఒవైసీ చేసిన సవరణలను కూడా సభ తిరస్కరించింది. లోక్ సభ బిల్లులో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాతనే ఈ బిల్లు చట్టం రూపంలోకి రానుంది.

Similar News