కష్టాల్లో టీడీపీ మేయర్

Update: 2018-01-11 08:23 GMT

టీడీపీ మేయర్ పై కేసు నమోదయింది. నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అతని సోదరుడిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు మేయర్ అజీజ్ కుంటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. మేయర్ అజీజ్ కుటుంబం స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదయింది. స్టార్ ఆగ్రో కంపెనీలో వాటా కోసం ఇచ్చిన 42 కోట్ల రూపాయలను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని వీరిపై ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో మేయర్, అతని కుటుంబ సభ్యులపై చెన్నైలో కేసు నమోదయింది. అయితే అరెస్ట్ ను తప్పించుకోవడానికి మేయర్ అజీజ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మేయర్ కావడంతో ఆయనపై కేసు నమోదు టీడీపీలో చర్చనీయాంశమైంది.

Similar News