ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై వివిధ పార్టీల నేతలు మండిపడుతున్నారు. కొద్దిరోజులుగా తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే జైట్లీ ఇవ్వబోమని తేల్చేయడాన్ని చూస్తుంటే ఏపీ అంటే ఆ పార్టీకి ఎంత చిన్నచూపో అర్థమవుతుందన్నారు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పడానికి వారికి ఉన్న ధైర్యం ఒకటేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమకు మద్దతివ్వక తప్పదన్న ధైర్యంతోనే మొండిగా కేంద్రం ముందుకు వెళుతుందన్నారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు లేవనడం అర్థరహితమన్నారు ఉండవల్లి. ఏపీ పట్ల అవహేళనగా మాట్లాడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.