మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. జన్మభూమి కార్యక్రమంలో ఈరోజు అధికారులను చెడామడా తిట్టేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విజయరాయిలో జరిగిన జన్మభూమికార్యక్రమంలో మైక్ సక్రమంగా వినియోగించకపోవడంతో చింతమనేని ఫైర్ అయ్యారు. వీఆర్వో నరసింహరావుపై చింతమనేని దుర్భాషలాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేదికపైన ఉన్న వారు కూడా చింతమనేని వాడిన భాషను చూసి విస్తుపోయారు.