గలీజు గజల్ కు మరో షాక్

Update: 2018-01-03 11:39 GMT

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం సేవ్ టెంపుల్ ప్రచారకర్త బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ సేవ్ టెంపుల్ సంస్థ వెలగపూడి ప్రకాశరావు ప్రకటించారు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడంతో ఆయనను పవిత్రమైన ఈ ప్రచార బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకాశరావు తెలిపారు. అయితే గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటీషన్ పై న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అంతేకాకుండా పోలీసులు తమకు ఏడు రోజులు శ్రీనివాస్ ను కస్టడీకి ఇవ్వాలని, ఆయనపై అనేక ఆరోపణలున్నాయని, వాటిని విచారించాలంటే గజల్ ను తమకు ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కూడా కోర్టు రేపు తీర్పు చెప్పనుంది. మొత్తం మీద గజల్ కు సంబంధించిన మరికొన్ని వీడియోలను కూడా బాధితురాలు బయటపెట్టింది. గజల్ గలీజు పనులకు సంబంధించి మొత్తం వంద వీడియోలు ఉన్నట్లు బాధితురాలు చెబుతున్నారు.

Similar News