గజల్ కస్టడీ పిటిషన్ కొట్టివేత

Update: 2018-01-04 14:22 GMT

లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. సేవ్‌ టెంపుల్స్‌ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న శ్రీనివాస్‌ .. అందులో పనిచేసే ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో రిమాండ్‌లో ఉన్నాడు. కేసు పురోగతి కోసం నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో ఈనెల 2న పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇవాళ పిటిషన్‌ తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించారు. గజల్‌ శ్రీనివాస్‌ను ఈనెల 2న అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపర్చగా .. న్యాయస్థానం ఈ నెల 12వరకు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను నిన్న ఉప సంహరించుకున్నారు. బెయిల్‌ కోసం రేపు సీనియర్‌ న్యాయవాది మరో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది

Similar News