లండన్ వెళ్లి విజయమాల్యాను చంద్రబాబు కలిశారని, ఆయన నుంచి 150 కోట్లు టీడీపీ విరాళంగా సేకరించిందని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. విజయమాల్యాను కలిసింది నిజమో? కాదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలపైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. దీనిపై ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకే చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.