కేటీఆర్ బంధువనంటూ బెదిరింపులు... పైసా వసూల్

Update: 2017-09-20 12:40 GMT

ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రి కేటీఆర్ బంధువు అని చేప్పుకుంటు సాఫ్ట్ వేర్ కంపెనీ డైరెక్టర్ లను రివాల్వర్ తో బెదిరించి, కంపెని ని తమ పేరున రాయించుకున్న ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలిస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డిసిపి విశ్వ ప్రసాద్ కేసు పూర్తి వివరాలను వెల్లడించారు....గచ్చిబౌలి ఖాజాగుడ సమీపంలో గ్రోవిక్ టేక్నాలజి ప్రేవేట్ లిమిటెడ్ పేరుతో అభిషేక్, సాయి చరణ్ లు డైరెక్టర్లు గా ఉంటూ కంపేనీని నెలకొల్పారు. వీరు కొంత మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుండి లక్షా యాభై వేల రూపాయలు వసూలు చేశారు..అందులో కొందరికి ఉద్యోగం రాకపోవడంతో వంశీ కృష్ణ ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన వంశీ కృష్ణ తను మంత్రి బంధువు అని చేప్పి అభిషేక్, సాయి చరణ్ లనుండి పది లక్షల రూపాయలు వసూలు చేశారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కంపెని ప్రాజెక్టు మేనేజర్ వంశీధర్, సేహ్నితుడు రాహుల్ ల సహకారంతో కంపెని డైరెక్టర్లను రివాల్వర్ తో బెదిరించి కంపెని తన పేరున రాయించుకున్నాడని డీసీపీ తేలిపారు. అతని నుంచి రేండు మొబైల్స్, బుగ్గ కారు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వంశీ కృష్ణ, రాహుల్ పై షాద్ నగర్ లో లైసెన్సు లేకుండా రివాల్వర్ వాడుతున్నారని, అదే విధంగా నిబంధనలకు విరుద్దంగా బుగ్గ కారులో దర్జాగా తిరుగుతూ అందరిని హడలెత్తిస్తున్నట్టు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా బెదిరింపులకు పాల్పడినట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్టు డీసీపీ తెలిపారు ..

Similar News