అక్కడికి పోలీసు అధికారులు వస్తుంటారు వెళుతుంటారు ఐపీయస్ లు కూడా వస్తుంటారు ...దానికి కూత వేటు దూరంలో దారుణం జరిగింది..పోలీసు ఆఫీసర్స్ మెస్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో హత్యాప్రయత్నం జరిగింది ..ఇంత భద్రత గల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా కత్తితో దాడి చేశారు. ఇతని పేరు ఇక్రమ్. రిటైర్డ్ నావల్ కార్గో ఆఫీసర్ ..హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఎలిగెన్స్ అపార్ట మెంట్ లో నివసిస్తున్నాడు..ఇతనొక ఎన్జీవో ..సోషల్ యాక్టివిస్ట్ .నిన్న రాత్రి నాంపల్లి నుండి ఇంటికి వచ్చి సెల్లార్ లో కారు పార్క్ చేస్తున్న టైం లో వెనుకనుండి ఒక్కసారిగా ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడిచేశారు .ఊహించని రీతిలో ఒక్కసారిగా దాడి జరగడంతో కుప్పకూలిపోయాడు ఇక్రం... శరీరంపై బలంగా కత్తపోట్లు దిగాయి.
ల్యాండ్ గొడవలేనా?
బయటి నుండి వచ్చిన ఇక్రం ను వెంబడించారా లేక అప్పటికప్పుడు జరిగిందా అన్నది పోలీసులకు ప్రశ్నగా మిగిలింది .కారు లో పలికి రాగానే బయటినుండి ముగ్గురు వ్యక్తులు ఆటో నుండి దిగి అపార్ట్ మెంట్ లోకి వచ్చి దాడి చేశారు. అతన్ని వెంటనే బంజారాహిల్స్ కేర్ హాస్పటల్ కి తరలించారు. అయితే పోలీసులు మాత్రం ల్యాండ్ గొడవల వల్ల వేరే వర్గం వాళ్లు దాడి చేసి ఉంటారని అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇతని మీద బంజారాహిల్స్ పియస్ పరిధిలో దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. .ప్రస్తుతం అయితే ఇక్రం ఆరోగ్యం నిలకడ గా ఉందిన డాక్టర్లు చెబుతున్నారు . సీసీటివీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు