కాంగ్రెస్ ను యువతే నడుపుతుంది

Update: 2018-03-17 06:15 GMT

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల రెండో రోజు రాహుల్ ప్రసంగించారు. దేశం యావత్తూ ఆగ్రహంతో ఉందని, అసంతృప్తితో రగలి పోతుందని, ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ విశిష్ట పాత్ర పోషించాలన్నారు. దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు మార్గదర్శనం చేయాలని కోరారు. పార్టీని ముందుకు నడిపించేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని రాహుల్ చెప్పారు. యువతను సీనియర్లే దగ్గరుండి నడిపించాలని కోరారు. దేశంలో అనేక సమస్యలున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేక అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేక ఆందోళనచెందుతున్నారన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెైస్ ముందుకు వెళ్లాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా సోనియాగాంధీ ఈరోజు మధ్యాహ్నం మూడుగంటలకు ప్రసంగించనున్నారు.

Similar News