కర్నూలులో తెదేపా వర్గాల రచ్చరచ్చ

Update: 2016-10-31 17:01 GMT

ఒకవైపు పొరుగునే ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ అధికార పార్టీ నాయకులు డిష్యుం డిష్యుం వరకు వెళ్లారు. అయితే కర్నూలులో అక్కడి అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు, వర్గ విభేదాలు ముదిరి తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ఇదంతా నంద్యాల మునిసిపల్ మీటింగ్ సందర్భంగా జరగడం విశేషం.

ఇదే నంద్యాల మునిసిపాలిటీ సమావేశంలో గతంలో జరిగిన ఒక రచ్చకు సంబంధించి భూమా నాగిరెడ్డి పై పోలీసు కేసు కూడా నమోదైన సంగతి పాఠకులకు తెలిసిందే. అరెస్టును తప్పించుకోడానికి ఆయన ఆస్పత్రి పాలై.. హైడ్రామా నడిపించి, చివరికి అరెస్టు అయ్యారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో తర్వాతి పరిణామాల్లో తెలుగుదేశంలో చేరారు.

సోమవారం జరిగిన సమావేశంలో ఆజన్మశత్రువులైన భూమా, శిల్పా వర్గీయులు వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణకు సంబంధించిన వివాదంతో ఈ గొడవరేగింది. భూమా వర్గీయులు రభస చేయడంతో.. అప్పటికే హాలు వెలుపల సిద్ధంగా ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్ది చెప్పారు.

Similar News