Ys Jagan : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తొలిసారి స్పందించిన జగన్.. హిందూపురంలో క్లారిటీ ఇచ్చిన నేత?

హిందూపురంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని వైసీీపీ అధినేత జగన్ అన్నారు

Update: 2024-05-04 07:16 GMT

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పైన దుష్ప్రచారం చేస్తున్నారని, భూములన్నీ లాక్కుంటాడని ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. భూమి మీద సంపూర్ణ హక్కులు ఇచ్చేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే పెద్ద సంస్కరణ అవుతుందన్నారు. రికార్డులు అప్‌డేట్ కాకపోయినా, భూవివాదాలు లేకుండా ఉండేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెస్తున్నామన్నారు. వారి భూముల కోసం రైతు అధికారుల చుట్టూ తిరగకూడదనే ఈ యాక్ట్ తెస్తున్నామని తెలిపారు. భూవివాదం ఉంటే టైటిల్ ఇన్సూరెన్స్ చేసి మరీ ఇస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఎవరి భూమి వాళ్లకు అప్పగించడానికే ఈ లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెస్తున్నామని తెలిపారు. వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టించి ఆ రైతన్నలకే హక్కుపత్రాలను ఇస్తామని తెలిపారు. ఆ భూములకు వివాదాలు వస్తే ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడమే ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.

మరో తొమ్మిది రోజులలో....
హిందూపురంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని వైసీీపీ అధినేత జగన్ అన్నారు. హిందూపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. గత యాభై తొమ్మిది నెలల్లో గ్రామాల్లో ఎన్ని మార్పులు వచ్చాయో చూశారు కదా? అని ప్రశ్నించారు. మ్యానిఫేస్టోను 98 శాతం అమలు చేసి తిరిగి మ్యానిఫేస్టోను అమలు చేస్తానంటూ ప్రజల్లోకి వెళుతున్నది కూడా మీ బిడ్డ అని జగన్ అన్నారు. గతంలో ఎప్పుడైనా ఇన్ని పథకాలు మీ ఇంటికి వచ్చాయా? అని జగన్ ప్రశ్నించారు. నేరుగా 2.75 లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా? అని ప్రశ్నించారు.
ఇన్ని పథకాలు ఎప్పుడైనా?
అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్‌మెంట్, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ చేదోడు, కాపు నేస్తం వంటి పథకాల గురించి విన్నారా? అంటూ జనాలను అడిగారు. ప్రతి పేదవాడిని గతంలో ఎప్పుడైనా ఇలా ఆదుకోవడం జరిగిందా? అని అడిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవ్వాతాతలకు మూడు వేల రూపాయల పింఛను ఇంటికే తెచ్చి ఇవ్వడం జరిగిందా? అని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి చూశారా? వాహనమిత్ర, మత్యకారుల భరోసా, లా నేస్తం వంటి పథకాలు అమలయ్యాయా? అని ప్రశ్నించారు. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు.
ఆ ముసలాయన...
మరో పక్క75 ఏళ్ల ముసిలాయన పథ్నాలుగేళ్లు సీఎంగా చేసినా పేదవాడికి ఒక్క మంచి అయినా చేశాడా? అని అడిగారు. పిండి కొద్దీ రొట్టెలన్న సామెత.. పిండి ఎంత ఎక్కువగా ఉన్నా చంద్రబాబుది అధికారంలో ఉన్నప్పుడు తాను, తన వారు తినేందుకే రొట్టెలు తయారు చేసుకుంటాడని అన్నారు. పథ్నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క రూపాయి అయినా బ్యాంకు ఖాతాలో వేశారా? అని అడిగారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన మ్యానిఫేస్టోలో ఒక్క హామీని కూడా నెరేవర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనని అన్నారు. బాబు పాలనలో డబ్బులన్నీ ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయని ఆయన నిలదీశారు. ఆలోచించాలని కోరారు. సూపర్ సిక్స్ అంటూ మళ్లీ ముగ్గురు వస్తున్నారని, మీరు నమ్ముతారా? అని ప్రశ్నించారు. రాబోయే మీ భవిష్యత్ ను నిర్ణయించేది ఈ ఎన్నికలు అని అన్నారు. పట్టపగలే మోసాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా వైసీపీకి ఓటు వేయాలని కోరారు.
Tags:    

Similar News