బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో పనిచేసేందుకు కొన్ని బృందాలను టీడీపీ పంపిందని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందన్నారు. అయినా కర్ణాటకలో బీజేపీ గెలుపు కాయమన్నారు. టీడీపీ పంపిన బృందాలు కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా 80 శాతం కాపులు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారని మాణిక్యాలరావు చెప్పారు. కాపులు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారన్నారు. గతంలో కమ్మ సామాజిక వర్గం ప్రత్యేక హోదా ఎందుకని కోరారని మాణిక్యాల రావు చెప్పారు. మరోవైపు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పార్లమెంటుకు నమస్కరిస్తే ప్రధాని మోడీకి నమస్కరించినట్లే అని చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు.