ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్

Update: 2017-01-11 07:43 GMT

జనవరి నెలలో ఉగ్రమూకలు చెలరేగిపోయే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్ లలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని కేంద్ర నిఘా సంస్థలు అన్ని ఎయిర్ పోర్ట్ లకు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ను ప్రకటించారు. ప్రతిది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.

అలాగే జనవరి 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ వేడుకల్లో కూడా ఉగ్ర దాడులు జరగొచ్చనే నిఘా సంస్థలు చెబుుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ, రాష్ట్ర డీజీపీలకు ఈ మేరకు నిఘా సంస్థలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధానంగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో దాడులు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. నిఘా సంస్థల హెచ్చరికతో ఈరోజు దాదాపు అన్ని ఎయిర్ పోర్ట్ లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విమానాల్లోనూ సోదాలు జరిపారు.

Similar News