ఎట్టకేలకు ఇంట్లోకి వెళ్లిన సంగీత

Update: 2018-01-11 14:24 GMT

సంగీత కల ఫలించింది..54 రోజుల దీక్షకు న్యాయష్టానం ముగింపు పలికింది. సంగీత కు నెలకు 20,000 తోపాటు..ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ..ఆమెకు, ఆమె పాపకు భర్త, అత్త మాములు తోడుగా ఉండలాబీ..తీర్పు ను ఇచ్చింది.. ఇది ఓ మహిళ విజయం. బొడుప్పల్ లో..కెమెరా సాక్షిగా దాడి..జుట్టుపట్టు కొని ఈడ్చి పడేసిన అత్త...సంగీత భార్య బతికే ఉండగా..మరో మహిళ తో కాపురం పెట్టడం ఓర్వ లేకపోయింది.. తనకు తన బిడ్డకు న్యాయం చేయమన్నందుకు దాడికి గురైంది.

54 రోజుల ఆందోళన అనంతరం...

మీడియా హడావుడితో మూడో భార్య గా వచ్చిన మహిళ తాను వెళ్లిపోతానునని, సంగీతకు న్యాయం చేసేలా చూడమని తెలుపింది..ఈ గొడవలు తెలియదు..విడాకులు ఇచ్చారు అంటే వచ్చాను అని తెలిపింది.మొక్కవోని దీక్షితో సంగీత..తన అత్త ఇంటిముందు ధర్నాకు దిగింది..దాడి విషయం తెలుసుకున్న పోలీసులు సంగీతకు అండగా నిలిచారు. మీడియా మహిళా సంఘాలు మద్దత్తు తో దీక్ష చేసింది..సంగీతకు సహాయం చేస్తామని రాజకీయనాయకులు ఎంట్రి ఇచ్చారు. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.. సంగీతను ఆమె అత్త ఇంట్లోకి రానియను అని తెగేసి చెప్పింది. ఏమాత్రం ధైర్యన్ని కోల్పోక 54 రోజులు దీక్ష చేసింది..తనకు తన బిడ్డ కు దారి చూపమని అడిగింది..ఇంతలో కోర్టు తీర్పు ఆమె జీవితానికి ఆసరా అయి నిలిచింది.మియాపూర్ కో ర్టు సంగీత కేసు లో ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది..సంగీత కు నెలకు 20 వేల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్ట్ చెప్పింది. శ్రీనివాస్ రెడ్డి వేసిన కౌంటర్ ను డిస్మిస్ చేసింది.సంగీత అదే ఇంట్లో ఉండేలా శ్రీనివాస్ రెడ్డి చూసుకోవాలని మియాపూర్ కోర్ట్ తీర్పు చెప్పింది.సంగీతకు వారి పాపకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీనివాస్ రెడ్డి. అత్త మామా.అదే ఇంట్లో ఉండేలా చూడాలని పేర్కొంది. రోజు దిన చర్య లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని కోర్ట్ తన అదేశాల్లో తెలిపింది. బోడుప్పల్ లో మహిళా సంఘాలు , బంధువుల సమక్షంలో సంగీత ఇంటి తాళాలు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించింది సంగీత. ఉద్విగ్నభరిత వాతావరణంలో కూతురితో కలిసి ఇంట్లో కలియతిరిగింది సంగీత.

Similar News