ఆంటీ అన్నాడు.. ఆ...పనిచేసి ఉడాయించాడు...!

Update: 2018-01-11 05:59 GMT

పదిహేను నిమిషాలో రెండు స్నాచింగ్‌లు చేశాడో యువకుడు. గళ్ల చొక్కా వేసుకొని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దడపుట్టించాడు. మియాపూర్‌ చెందిన గోకుల్‌ ఫ్లాట్స్‌లో నివాసముండే శ్రీలత బుధవారం సాయంత్రం 8గంటల ప్రాంతంలో ఇంటిముందు ముగ్గేస్తోంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు ఆంటీ అంటూ పిలిచాడు. ఆమె తిరిగి చూసేలోగా మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసు చోరీచేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది జరిగిన పదిహేను నిమిషాల్లో వసంతనగర్‌లో మరో మహిళ మెడలో రెండు తులాల చైన్ స్నాచింగ్‌ చేసి పారిపోయాడు. బాధితురాలు కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పదిహేను నిమిషాల సమయంలో రెండు స్నాచింగ్‌లు జరగడంతో పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు. గళ్ల చొక్కా యువకుడు ఈ చోరీలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. అతను ఉపయోగించిన ద్విచక్ర వాహనం నెంబర్‌ సీసీ కెమెరాలో కనిపించకపోవడంతో మిగతా కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Similar News