ఆ స్టూడెంట్స్ కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Update: 2017-09-19 02:22 GMT

ఫాతిమా కళాశాల మెడికల్ విద్యార్ధులకు న్యాయం చేయడానికి అఖిల భారత వైద్య విద్యా మండలి చైర్మన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉనాతాదికారులతో చర్చించినట్లు ఆంద్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని చెప్పారు. ఏపీ కి కేటాయించిన , భర్తీకాని పిజి మెడికల్ సీట్లను భర్తీచేయడంతో పాటు , ఫాతిమా కళాశాల వైద్య విద్యార్ధుల సమస్య పరిష్కారానికి, ఢిల్లీ లోని అఖిల భారత వైద్య విద్యా మండలి చైర్మన్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఫాతిమా కళాశాల విద్యార్ధుల సమస్య పరిష్కారానికి సుప్రీమ్ కోర్టు ఆదేశాలను అనుసరించి విద్యార్ధులకు తగు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిధిలోని 11 ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలల్లో ఫాతిమా కళాశాలకు చెందిన 99 మంది వైద్య విద్యార్ధులను సర్దుబాటు చేసి వారికి న్యాయం చేయుటకు అఖిలభారత వైద్య విద్యామండలి చైర్మన్ తో చర్చించినట్లు చెప్పారు. విద్యార్ధులు ఇప్పటికే కళాశాల ఫీజులు చెల్లించినందున తిరిగి వారిపై భారం పడకుండా ఆయా కళాశాలల్లో సర్డుభాటు చేయనున్నారు. రాష్ట్రానికి కేటాయించి భర్తీకాని 24 పిజి మెడికల్ సీట్లకు డి.జి.హేచ్.ఎస్ ద్వారా మరొకసారి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేయడం లేదా ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ ద్వారా భర్తీ చేయుటకు తగు సూచనలు ఇవ్వాలని వైద్య విద్య మండలి చైర్మన్ ను కోరినట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.

Similar News