అమరావతికి రూ.809 కోట్లు

Update: 2017-07-19 03:33 GMT

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మౌలిక వసతులు., సదుపాయాల కల్పన కోసంకేంద్ర విడుదల చేసిన నిధుల్లో మార్చి 31నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.809.33కోట్లు ఖర్చు చేసింది. రాజ్యసభలో ఎంపీ ఎంఏ ఖాన్‌ ప్రశ్నకు ఆర్ధిక శాఖ బదులిచ్చింది. కేంద్రం మూడేళ్లలో రూ.1050కోట్లు ఏపీకి ఇచ్చిందని వాటిలో తాత్కలిక అసెంబ్లీ., సచివాలయ నిర్మాణానికి రూ.401.81 కోట్లు., రహదారులకు రూ.293 కోట్లు.,విద్యుత్‌ పనులకు 49.83 కోట్లు., నీరు, మురుగు, వరద నీటి వ్యవస్థల ఏర్పాటుకు 10.87 కోట్లు అసెంబ్లీ., సచివాలయం ఇతర అత్యవసర సౌకర్యాల కల్పనకు రూ.53.89కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం లెక్కలు చూపింది.

Similar News