అజ్జూ భయ్యా...అదిరిందయ్యా...

Update: 2017-01-10 12:14 GMT

అజ్జూ భయ్యా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ వచ్చారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్స్ంగ్ ఆరోపణలను ఎదుర్కొన్న అజారుద్దీన్ తర్వాత రాజకీయాల్లో చేరారు. రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలందించారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉండే అజారుద్దీన్ హటాత్తుగా హైదరాబాద్ వచ్చి హెచ్.సి.ఎ. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఓటు హక్కు లేకున్నా పోటీ చేయవచ్చని హైదరాబాద్ లో అజారుద్దీన్ తెలిపారు. లోధా కమిటీ సిఫార్సుల మేరకే తాను నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవీనితి ఆరోపణలున్నాయన్న అజార్ తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఉత్తమ క్రికెటర్లను తయారు చేస్తానని చెప్పారు.

Similar News