ఎక్కడా తగ్గడం లేదుగా….!!!

ప్రతి ఓటూ కీలకమే… ఓటర్లూ నిలదీస్తున్నారు. పార్టీ కార్యకర్తలయితే సరేసరి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అనేకచోట్ల [more]

Update: 2019-04-11 06:38 GMT

ప్రతి ఓటూ కీలకమే… ఓటర్లూ నిలదీస్తున్నారు. పార్టీ కార్యకర్తలయితే సరేసరి. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అనేకచోట్ల ఘర్షణ వాతావారణం ఏర్పడింది. సమస్యాత్యమక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసులు అక్కడ భారీగా పోలీసులను మొహరించారు. కానీ ఇప్పడు ఏపీలో సమస్యాత్మక అనేదే లేకుండాపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ప్రతి చోటా బాహాబాహీకి దిగుతున్నారు.

గత ఎన్నికలకు భిన్నంగా….

గత ఎన్నికలు ప్రశాంతంగా ఏపీలో జరిగాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరుగుతుంది. రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికలను ప్రతిష్టాత్మకం తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనింది. ఒక్క ఓటు వద్ద ఏదో ఒక పార్టీ అభ్యంతరం చేయడం, దానిపై గొడవలు చేయడం ఏపీలో సర్వసాధారణంగా మారింది. అయితే హింసాత్మక ఘటనలు ఇప్పటి వరకూ ఎక్కడా పెద్దగా జరగకపోయినా పోలింగ్ ను అడ్డుకోవడం, ఘర్షణలకు దిగడం ఎక్కువ చోట్ల కన్పించింది.

ఎవరూ తగ్గకుండా…..

ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి చోటా టీడీపీ నేతలను అడ్డుకోవడం కన్పించింది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోలింగ్ కేంద్ర వద్దే మొహరించి ఉండటంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం పోలింగ్ శాతం కూడా భారీగానే పెరిగే అవకాశముందంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం ఎవరికి లాభమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

Tags:    

Similar News