జగన్ పై బాబు వ్యాఖ్యలతో వైసీపీ?

శాసనసభలో మీడియాపై ఆంక్షలపై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఉన్మాది అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని వైసీపీ నేతలు తప్పుపట్టారు. వెంటనే చంద్రబాబు సభకు [more]

Update: 2019-12-12 05:03 GMT

శాసనసభలో మీడియాపై ఆంక్షలపై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఉన్మాది అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని వైసీపీ నేతలు తప్పుపట్టారు. వెంటనే చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగుతూ సభాసంప్రదాయాలను మంటగలుపుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. గడచిన రెండు మూడు రోజుల నుంచి టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయమన్నారు. వ్యక్తిగతంగా దూషించడం, సీఎంను అమర్యాదగా మాట్లాడటం చంద్రబాబుకు సరికాదని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. దీనిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని ఆనం కోరారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని వైసీీప నేతలు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News