Ys sharmila : కేసీఆర్ నువ్వు రాజీనామా చేయ్

తెలంగాణ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పడానికే పాదయాత్ర చేపట్టినట్లు వైఎస్ షర్మిల తెలిపారు. దేశంలోనే అత్యంత వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు గడించారన్నారు. తెలంగాణలో వందల [more]

Update: 2021-10-20 09:13 GMT

తెలంగాణ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పడానికే పాదయాత్ర చేపట్టినట్లు వైఎస్ షర్మిల తెలిపారు. దేశంలోనే అత్యంత వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు గడించారన్నారు. తెలంగాణలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ షర్మిల తెలిపారు. పాదయాత్ర ప్రారంభించే ముందు చేవెళ్లలో బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు. కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్యాకేజీలను పెంచారన్నారు.

రాష్ట్రం వచ్చాక…

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దగా చేశారని షర్మిల విమర్శించారు. దళితులకు మూడు ఎకరాలను ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. తన తండ్రి వైఎస్ పెట్టిన అనేక సంక్షేమ పథకాలే ఇప్పుడూ అమలవుతున్నాయని షర్మిల అన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటానని షర్మిల తెలిపారు. తెలంగాణలో 800 మంది దళితులపై దాడులు జరిగాయని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ షర్మిల మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.

Tags:    

Similar News