ఖమ్మంలో సభ జరిపి తీరుతాం

ఖమ్మంలో ఈ నెల 9వ తేదీన వైఎస్ షర్మిల సభ జరుగుతుందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభను తాము [more]

Update: 2021-04-07 01:00 GMT

ఖమ్మంలో ఈ నెల 9వ తేదీన వైఎస్ షర్మిల సభ జరుగుతుందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభను తాము నిర్వహిస్తామని చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే సభ నిర్వహిస్తామని కొండా రాఘవరెడ్డి చెప్పారు. పోలీసులు కావాలని సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సభకు వచ్చే వారికి అనేక ఆటంకాలు కల్పిస్తున్నారని కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. వైఎస్ షర్మిల ఖమ్మం గడ్డ మీద అడుగుపెడితే ఎవరికి వణుకు పుడుతుందో అందరికీ తెలుసునన్నారు.

Tags:    

Similar News