జగన్ చారిత్రాత్మక నిర్ణయం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గం కొద్దిసేపటి క్రితం ఆమోదించింది. [more]

Update: 2019-09-04 08:22 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గం కొద్దిసేపటి క్రితం ఆమోదించింది. ఇప్పటికే ఆర్టీసీ విలీనంపై కమిటీని నియమించి నివేదిక తెప్పించుకున్న జగన్ ఒక్కరోజులోనే విలీనం చేసేందుకు అంగీకరించడం విశేషం. దీంతో ఏపీలోని లక్షలసంఖ్యలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వోద్యోగులుగా మారిపోయినట్లయింది. ఇక కొత్త ఇసుక పాలసీని కూడా మంత్రి వర్గం ఆమోదించింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఏపీఎండీసీ ద్వారా ఆన్ లైన్ లో ఇసుకను బుకింగ్ చేసుకోవచ్చాన్నారు. రేపటి నుంచే కొత్త ఇసుకపాలసీ ఏపీలో అమల్లోకి రానుంది.

Tags:    

Similar News