నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ పోలీసుల గౌరవ [more]

Update: 2020-11-01 02:12 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. తెలుగుతల్లికి, పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. మంత్రులుతమ జిల్లాల్లో జెండా వందన కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు అంద చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

Tags:    

Similar News