అది తప్పుడు ఆలోచన.. జాతీయ మీడియాతో జగన్

నగరాల ద్వారా ఆదాయం పెరుగుతందనుకోవడం తప్పుడు ఆలోచన అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కరోనా సమయంలో నగరాల పరిస్థితి అందరికీ అర్థమయిందని చెప్పారు. ఒక [more]

Update: 2020-09-09 03:48 GMT

నగరాల ద్వారా ఆదాయం పెరుగుతందనుకోవడం తప్పుడు ఆలోచన అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కరోనా సమయంలో నగరాల పరిస్థితి అందరికీ అర్థమయిందని చెప్పారు. ఒక జాతీయ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. లక్ష కోట్ల తో ఒక నగరాన్ని నిర్మించాలనుకోవడం అవివేకమని చెప్పారు. దాని వల్ల భవిష్యత్ లో వచ్చే ఆదాయం కంటే అప్పుల భారం ఎక్కువవుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన పది దేశాల్లో మహా నగరాలు లేవన్న విషయం గుర్తుంచుకోవాలని జగన్ చెప్పారు. అమరాతిలో శాసన రాజధాని కొనసాగుతుందని జగన్ చెప్పారు. అక్కడ కేవలం 29 గ్రామాల్లోని కొంత మంది పలు కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారని జగన్ అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు సమర్థిస్తారని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News