పరిహారం వెంటనే చెల్లించండి.. అధికారులకు జగన్ ఆదేశం

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ను నిర్వహించారు. విశాఖలో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరణించిన బాధిత [more]

Update: 2020-05-08 07:45 GMT

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ను నిర్వహించారు. విశాఖలో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరణించిన బాధిత కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియోను వెంటనే విడుదల చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. బాధితులు కోలుకునేంత వరకూ మెరుగైన వైద్య చికిత్సలను ఉచితంగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్యాస్ లీక్ కాకుండా తీసుకున్న నివారణ చర్యలను గురించి జగన్ కు వివరించారు. గ్యాస్ పూర్తిగా గాలిలో కన్పించకుండా పోవడానికి మరో పథ్నాలుగు గంటల సమయం పడుతుందని తెలపిారు. ఫ్యాక్టరీలో అన్ని రసాయనాల ట్యాంకులు భద్రంగా ఉన్నాయని చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో అక్కడే ఉన్న సీఎస్ నీలం సాహ్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News