సెలవులు కట్ చేసిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి అధికారులకు సెలవులు కట్ చేశారు. ఇసుక కొరత తీరేంత వరకూ అధికారులు ఎవరూ సెలవులు తీసుకోవద్దని జగన్ ఆదేశించారు. రెండు [more]

Update: 2019-11-12 07:42 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి అధికారులకు సెలవులు కట్ చేశారు. ఇసుక కొరత తీరేంత వరకూ అధికారులు ఎవరూ సెలవులు తీసుకోవద్దని జగన్ ఆదేశించారు. రెండు రోజుల్లో ఇసుక అన్ని రీచుల్లో లభ్యమవుతుందని జగన్ అభిప్రాపడ్డారు. ఇసుక పక్కదారి పట్టకుండా అన్ని చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయికి రావాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్పొరేషన్ ద్వారా నియామకాలు జరుగుతాయన్నారు. దీనివల్ల అవినీతి, నియామకాల్లో అన్యాయం జరగదని జగన్ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తుల ప్రమేయం కూడా నియామకాల్లో ఉండదన్నారు జగన్. జనవరి 1వ తేదీ నుంచి ప్లేస్ మెంట్ ఆర్డర్స్ ఉంటాయన్నారు.

Tags:    

Similar News