జగన్ కూడా వాయిదా పద్ధతిలోనే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. తొలుత యాభై శాతం చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన యాభై శాతం వేతనాన్ని తర్వాత చెల్లించాలని నిర్ణయించింది. లాక్ [more]

Update: 2020-04-01 01:36 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. తొలుత యాభై శాతం చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన యాభై శాతం వేతనాన్ని తర్వాత చెల్లించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పింఛనుదారులకు కూడా యాభై శాతం కోత విధించారు. ప్రజాప్రతినిధుల జీతాలను పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభిస్తోంది. ఈ నిధులను అత్యవసరాల కోసం వినియోగించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు 60 శాతం కోత విధించారు. ఇప్పటికే పేదలకు కుటుంబానికి వెయ్యి రూపాయలు ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం 1,300 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడిన తర్వాత ఉద్యోగుల మిగిలిన వేతనం చెల్లించాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News