నేడు మంత్రులతో జగన్.. కీలక నిర్ణయాల దిశగా

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కేబినెట్ నేడు ఆమోదించనుంది. సీఎం [more]

Update: 2020-03-27 01:55 GMT

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కేబినెట్ నేడు ఆమోదించనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించడంతో పాటుగా కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. అలాగే లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలు అందించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ చర్చించనుంది. మార్చి 31వ తేదీ వరకే ఏపీలో కర్ఫ్యూ విధించారు. దీనిని ఏప్రిల్ 14వ తేదీ వరకూ పొడిగించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏపీలో కూడా కర్ఫ్యూను అప్పటి వరకూ కొనసాగించనున్నారు. ఏపీలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే కర్ఫ్యూ సడలింపు ఉంది. ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతుంది.

Tags:    

Similar News