లాక్ డౌన్ పై జగన్ కీలక నిర్ణయం నేడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కీలక ప్రకటన చేయనున్నారు. ఆయన సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రధానంగా కరోనాపై మరింత కఠిన చర్యలు [more]

Update: 2020-03-26 06:48 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కీలక ప్రకటన చేయనున్నారు. ఆయన సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రధానంగా కరోనాపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పది మాత్రమే ఉన్నప్పటికీ మరింత ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని జగన్ సూచించనున్నారు. దీంతో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచడంతో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించనున్నారు. లాక్ డౌన్ విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News